తహసీల్దార్ సంతకం, అధికారిక ముద్రల నకిలీతో భూమి రిజిస్ట్రేషన్ నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్లు, స్టాంపులు సీజ్

మెట్‌పల్లి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు తహసీల్దార్ కార్యాలయ అధికారిక ముద్రలను నకిలీగా తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ కోసం నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సురేష్ బాబు తెలిపారు.

ఆదివారం కేసు వివరాలను వెల్లడించిన సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ.. గత నెలలో మెట్‌పల్లి తహసీల్దార్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, కార్యాలయ అధికారిక ముద్రలను నకిలీగా తయారు చేసి వాటి ఆధారంగా ఆరపేట శివారులోని సర్వే నంబర్ 191లో గల 8 గుంటల భూమికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మెట్‌పల్లి డీఎస్పీ రాములు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి ఆరుగురు నిందితులను గుర్తించినట్లు చెప్పారు. వీరిలో రాజులదేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేశ్, పాకాల రాకేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ సహా మొత్తం ఆరుగురు నిందితులు కుమ్మక్కై నేరానికి పాల్పడినట్లు తేలిందన్నారు.

భూమికి ఆబాది సర్టిఫికెట్ జారీ చేయడానికి తహసీల్దార్ కార్యాలయం నిరాకరించినప్పటికీ, డాక్యుమెంట్ రైటర్ పాకాల రాకేశ్ తన కంప్యూటర్‌లో నకిలీ ఆబాది సర్టిఫికెట్ తయారు చేసి, తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని తెలిపారు. అలాగే అంగారి శంకర్ నకిలీ ముద్రలు తయారు చేసి నేరానికి సహకరించినట్లు వెల్లడించారు.

నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా మెట్‌పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో కొందరు నిందితులు ఆర్థిక లాభం పొందినట్లు గుర్తించినట్లు చెప్పారు.

ప్రజలు భూముల కొనుగోలు సమయంలో సంబంధిత ప్రభుత్వ రికార్డులు, ధ్రువపత్రాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వ
ప్రత్యేక బృందం దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణం
భూముల కొనుగోలులో పత్రాలు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసుల సూచన