న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొప్పుల రాజును మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం తమలాంటి కోట్లాది కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే స్థలమని పేర్కొన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని చెప్పారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి సహా పార్టీ నాయకత్వం ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అని తెలిపారు.