నంద్యాల, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆత్మకూరు సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు విస్తృత స్థాయిలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ తనిఖీలు నిర్వహించారు.
ఆత్మకూరు డీఎస్పీ పర్యవేక్షణలో సబ్-డివిజన్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులు, వాహనాలు, నివాస ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు స్థానిక ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని సూచించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.