కరీంనగర్ ఆగస్టు 6
తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శోభారాణి అధ్యక్షతన గురువారం "గ్రామ బాలల పరిరక్షణ కమిటీ" సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో బాలల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, అధికారులకు, కమిటీ సభ్యులకు తగు సూచనలు చేశారు.0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు మెరుగైన రక్షణ, సంరక్షణ సేవలను అందించడం.
సెమీ-అర్బన్ ప్రాంతాలు మరియు అనాథ (ఆర్ఫన్) పిల్లల సమగ్ర డాటా సేకరణ చేపట్టడం.
బాల్య వివాహాలు జరగకుండా కట్టడి చేయడం., గ్రామంలో బాల కార్మికులు భిక్షాటన చేయించే పిల్లలు ఎవరూ లేకుండా చూడటంతో పాటు, బడి బయట ఉన్న (డ్రాప్-అవుట్) పిల్లలను మళ్లీ బడిలో చేర్పించేలా గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, మిషన్ వాత్సల్య అధికారి సాదినేని రమేష్, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ ప్రణీత, పల్లె దవాఖాన డాక్టర్ జవేరియా, ప్రధానోపాధ్యాయులు ఉమా, అంగన్వాడీ టీచర్ అరుంధతి, ఆశా కార్యకర్తలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.