కరీంనగర్ ఆగస్టు 6 స్థానిక నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల, పారమిత లిటిల్ జీనియస్ విధ్యార్థులు అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 14 విభాగాలలో సత్తాచాటి ముగ్గురు విధ్యార్థులు బంగారు పథకాలు, ఐదుగురు రజిత పథకాలు సాధించి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధిం చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కవిత ప్రసాద్ తెలిపారు. ఇటీవల నగరంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 14 విభాగాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న వి. సి

కరీంనగర్ ఆగస్టు 6
స్థానిక నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల, పారమిత లిటిల్ జీనియస్ విధ్యార్థులు అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 14 విభాగాలలో సత్తాచాటి ముగ్గురు విధ్యార్థులు బంగారు పథకాలు, ఐదుగురు రజిత పథకాలు సాధించి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధిం చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కవిత ప్రసాద్ తెలిపారు.
ఇటీవల నగరంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 14 విభాగాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న వి. సిరిచందన జావెలిన్ త్రో విభాగంలో బంగారు పథకం, ఒకటవతరగతి చదువుతున్న గాలి శ్రేయాన్షి 150 మీటర్ల పరుగు పందెంలో బంగారు పథకం, 60 మీటర్ల పరుగు పందెంలో బంగారు పథకం, ఒకటవతరగతి చదువుతున్న ఇల్లందుల అయాన్ బ్రాడ్ జంప్ లో బంగారు పథకం, ఐదవ తరగతి చదువుతున్న ఉమ్మే హని 400 మీటర్ల పరుగు పందెంలో రజిత పథకం, రెండవ తరగతి చదువుతున్న ఆయేషా పర్ వీణ్ 60 మీటర్ల విభాగం పరుగు పందెంలో రజిత పథకం, శనిగరపు తేజవర్ధన్ 60 మీటర్ల విభాగం పరుగు పందెంలో రజిత పథకం, శనిగరపు తేజవర్ధన్ బ్రాడ్ జంప్ లో రజిత పథకం, ఒకటవతరగతి చదువుతున్న ఆరోహి గోనె 200 మీటర్ల పరుగు పందెంలో రజిత పథకం, విలాస్ కస్తూరి 60 మీటర్ల విభాగం లో బ్రాడ్ జంప్ రజితం పథకం, ఒకటవతరగతి చదువుతున్న తన్వి శ్రీ కాంస్య పతకం ఆగస్టు 7.8 తేదీలలో హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ అసోషియేషన్ చాంపియన్ షిప్ ఆద్వర్యంలో నిర్వహించే పోటీలలో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కవిత ప్రసాద్, బాలాజీ, సమన్వయకర్తలు వ్యాయామ ఉపాధ్యాయులు జిలానీ, చామనపల్లి మహేష్, సాదుల రజిత లు అభినందించారు.