మహిళల సాధికారత, భద్రత, స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన నిర్వాహకులు

మేడ్చల్, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): మేడ్చల్-మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ పి. సుమతిను మర్యాదపూర్వకంగా కలిసి “ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఇండియా” కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, మహిళల సాధికారత, భద్రత, విద్య, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో “ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఇండియా” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.

సమాజంలో మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, హక్కుల పరిరక్షణకు దోహదపడే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

కార్యక్రమ విజయవంతానికి పోలీస్ శాఖ సహకారం, మార్గదర్శకత్వం అవసరమని కోరగా, సీపీ పి. సుమతి మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణను అభినందించారు.