వరంగల్, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాసి సూరయ్య సతీమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదాసి చిన్న, గోదాసి వీరేశంల మాతృమూర్తి కీ.శే. గోదాసి కోమలమ్మ మృతికి వరంగల్ కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
ఆదివారం ధర్మారం గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కోమలమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోమలమ్మ మరణం వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
అనంతరం గోదాసి చిన్న, గోదాసి వీరేశం మరియు కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.